Mon Dec 23 2024 02:54:50 GMT+0000 (Coordinated Universal Time)
SRH vs RR: హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్.. గతంలో ఎవరు ఎక్కువ గెలిచారు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్లేఆఫ్స్ క్వాలిఫైయర్ 2లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్లేఆఫ్స్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ (RR) శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. బుధవారం అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో RR నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మంగళవారం ఇదే వేదికపై జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో SRH జట్టును KKR ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.
SRH vs RR హెడ్-టు-హెడ్లో.. రెండు జట్లు IPLలో 19 సార్లు ఒకదానితో ఒకటి ఆడాయి, రాయల్స్ తొమ్మిది సార్లు గెలిచింది, సన్‌రైజర్స్ 10 సార్లు విజయం సాధించింది. SRH vs RR మ్యాచ్ రాత్రి 7:30 PM IST కి ప్రారంభమవుతుంది, మ్యాచ్‌కు అరగంట ముందు రాత్రి 7:00 గంటలకు టాస్ పడుతుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. భారతదేశంలో టెలివిజన్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఆన్ లైన్ లో JioCinemaలో అందుబాటులో ఉంది.
Next Story