Mon Dec 23 2024 07:34:15 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ సీజన్ 15 వచ్చేస్తోంది
ఈసారి ఐపీఎల్ సీజన్ ను స్వదేశంలోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ ఆ సమయానికి కరోనా కేసులు అదుపులోకి రానిపక్షం
ప్రపంచ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ సీజన్ 15 మరో రెండు నెలల్లో మొదలవ్వనుంది. ఐపీఎల్ 15వ సీజన్ ను ఈ ఏడాది కాస్త ముందుగానే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరులోనే సీజన్ ను ప్రారంభించేలా బీసీసీఐ సన్నాహాలు చేస్తోందట. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.
Also Read : ముంబైలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం
ఈసారి ఐపీఎల్ సీజన్ ను స్వదేశంలోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ ఆ సమయానికి కరోనా కేసులు అదుపులోకి రానిపక్షంలో మరోసారి లీగ్ ను విదేశాల్లో నిర్వహించక తప్పదన్నారు. అన్ని ఫ్రాంచైజీలు భారత్ లోనే లీగ్ జరగాలని కోరుకుంటున్నాయని తెలిపారు. కానీ.. ఐపీఎల్ స్వదేశంలోనే జరిగినా అన్ని ఫ్రాంచైజీల సొంత నగరాల్లో మ్యాచ్లు నిర్వహించడం సాధ్యం కాదని బీసీసీఐ భావిస్తోంది. భారత్ లో లీగ్ నిర్వహించడం వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ వేదికగా.. దక్షిణాఫ్రికాను ఎంచుకోవచ్చని తెలుస్తోంది.
Next Story