Sat Nov 23 2024 07:49:57 GMT+0000 (Coordinated Universal Time)
వర్షం అడ్డంకి.. గెలిచిన భారత్
డబ్లిన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన
ఐర్లాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారతజట్టు విజయాన్ని అందుకుంది. తొలి టీ20 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. 140 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 6.3 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసిన దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం ఎంతసేపటికీ ఆగకపోవడంతో భారత్ గెలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. 2 పరుగుల తేడాతో టీమిండియా విజయం అందుకుంది. వర్షం పడే సమయానికి క్రీజులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 29, సంజు శాంసన్ 1 ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేయగా, తిలక్ వర్మ (0) డకౌట్ అయ్యాడు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి, తిలక్ వర్మలను పెవిలిన్ చేర్చాడు.
డబ్లిన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. ఓ దశలో 59 పరుగలకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ ను బ్యారీ మెకార్తీనే గట్టెక్కించాడు. మెకార్తీ 33 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సులతో 51 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మెకార్తీ సిక్స్ కొట్టి అర్ధసెంచరీ అందుకున్నాడు. మార్క్ అడైర్ 16 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో కర్టిస్ కాంఫర్ 39 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, రవి బిష్ణోయ్ 2, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
Next Story