Sat Dec 28 2024 23:25:58 GMT+0000 (Coordinated Universal Time)
మరో సంచలనం: ఇంగ్లండ్ పై ఐర్లాండ్ విజయం
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఇంగ్లండ్ పై ఐర్లాండ్ విజయాన్ని అందుకుంది. అయితే డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎంసీజీలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలింగ్ తో రాణించి.. ఇంగ్లండ్ ను కట్టడి చేసింది. ఆఖర్లో వర్షం రావడంతో ఇంగ్లండ్ పై విజయాన్ని సొంతం చేసుకుంది. 14.3 ఓవర్ల వద్ద 5 వికెట్ల నష్టానికి 105 పరుగులతో ఇంగ్లండ్ ఉండగా వర్షం పడింది. జాష్ లిటిల్ 2 వికెట్లు తీయగా.. డాక్ రెల్, హ్యాండ్, మెక్ కార్టీ చెరో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ లో మలాన్ 35 పరుగులు చేయగా.. మొయిన్ అలీ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐరిష్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండ్రూ బిల్బిర్నీ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలినవారు పెద్దగా రాణించకపోవడంతో ఐర్లాండ్ అనుకున్న దానికంటే తక్కువ పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్‌కు మూడు, సామ్ కర్రాన్‌కు రెండు, మార్క్‌వుడ్‌కు మూడు, బెన్‌స్టోక్స్‌కు ఒక వికెట్ దక్కాయి.
Next Story