Tue Nov 05 2024 23:30:28 GMT+0000 (Coordinated Universal Time)
ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ తిక్క కుదిర్చిన బీసీసీఐ
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి పేర్లు కనిపించడం లేదు. బీసీసీఐ చెప్పినా కూడా పట్టించుకోకుండా రంజీ మ్యాచ్ లకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో సెంట్రల్ కాంటాక్ట్ లిస్టులో బీసీసీఐ ఈ ఇద్దరికీ ఇచ్చింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన ఆటగాళ్లలో రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా ఏ ప్లస్ స్థానాలను నిలుపుకున్నారు. బి కేటగిరి నుంచి శ్రేయస్, సి కేటగిరి నుంచి ఇషాన్ ను తొలగించారు. హార్దిక్ పాండ్యా ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలుపుకున్నాడు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ దక్కింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్ కు నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది.
ఏ ప్లస్ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
ఏ కేటగిరి: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా
బి కేటగిరి: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్
సి కేటగిరి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్
Next Story