Sat Dec 28 2024 05:51:33 GMT+0000 (Coordinated Universal Time)
గల్లీ క్రికెటర్లకు సూపర్ గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
చాలా మంది టెన్నిస్ బాల్ క్రికెట్ అద్భుతంగా ఆడుతూ
మన వీధుల్లో ఉండే పిల్లలలో, యువకుల్లోనూ ఎంతో ట్యాలెంట్ ఉంటుంది. చాలా మంది టెన్నిస్ బాల్ క్రికెట్ అద్భుతంగా ఆడుతూ ఉంటారు.. అలాంటి వారి లోని ట్యాలెంట్ ను బయటకు తీయడానికి ఒక కొత్త టోర్నమెంట్ రాబోతోంది. ట్యాలెంట్ ఉంటే గల్లీ నుండి క్రికెట్ స్టేడియం దాకా ఎదిగేలా చేయడంలో భాగంగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) రాబోతోంది. ఇందులో భాగంగా మొట్టమొదటి ఎడిషన్ వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నారు.
మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇదొక టీ10 ఫార్మాట్ లో జరగబోయే టెన్నిస్ బాల్ టోర్నమెంట్. ఇందులో ముంబైతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్ నుండి మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఈ ఆరు జట్లను ఆరు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్ లు కాగా, అన్నీ ముంబై వేదికగానే జరగనున్నాయి. ప్రతి జట్టులో గరిష్ఠంగా 16 మంది ఆటగాళ్లు, 6 సపోర్ట్ స్టాఫ్ ఉండనున్నారు. ఒక్కో ఫ్రాంఛైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం కోటి రూపాయల పరిమితి ఉంటుంది. వేలంలో ఒక్కో ప్లేయర్ కనీస ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఈ వేలం ఫిబ్రవరి 24న జరగనుంది. ఈ టోర్నమెంట్ ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
Next Story