Sun Dec 22 2024 16:19:56 GMT+0000 (Coordinated Universal Time)
Mahendra Singh Dhoni : అప్పుడే మైదానంలో ధోని కనిపిస్తాడట.. లేకపోతే లేదట
మహేంద్ర సింగ్ ధోనీ అన్ని ఫార్మాట్లలో రిటైర్ అయి చాలా కాలమయింది. కేవలం ఐపీఎల్ లోనే కనిపిస్తాడు
మహేంద్ర సింగ్ ధోనీ.. ఎంత వయసు పెరిగినా.. మైదానంలో ధోనీ ఉంటే చాలు ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానులున్నారు. మ్యాచ్ ఓడిపోతున్నా సరే ధోనీ మైదానంలో బ్యాట్ తో కనిపిస్తే చాలునని ఫ్యాన్స్ భావిస్తుంటారు. ఇప్పటికీ తరగని క్రేజ్ ఒక్క మహేంద్రుడికి మాత్రమే ఉంది. ఎందుకో తెలియదు కానీ.. విపరీతమైన అభిమానం.. ఎంతగా అంటే ధోనీ ఆడుతున్నారంటే చాలు.. ఇక ఎంత ఖర్చయినా సరే అక్కడకు వెళ్లి మ్యాచ్ ను చూడటం వారికి అలవాటు. అలా ఇప్పటికీ.. ఎప్పటికీ తరగని అభిమానులను సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే.
అన్ని ఫార్మాట్లలో...
మహేంద్ర సింగ్ ధోనీ అన్ని ఫార్మాట్లలో రిటైర్ అయి చాలా కాలమయింది. వికెట్ కీపర్ గా ధోనీ వేగంగా కదలికలు చూసి ఇప్పటికీ ఫ్యాన్స్ పులకించి పోతుంటారు. ఇక బ్యాట్ పడితే చాలు సిక్సర్, ఫోర్లతో మోత మోగిస్తాడన్న నమ్మకం. దీంతో పాటు కెప్టెన్ గా ఉంటే చాలు ఆ జట్టు కనీసం ఫైనల్స్ కు చేరినట్లే భావిస్తారు. అలాంటి ధోని ఇప్పుడు కనిపించాలంటే కేవలం ఐపీఎల్ లోనే సాధ్యం. ఎందుకంటే మిగిలిన అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ ప్రకటించడంతో ధోనీని మైదానంలో చూడాలంటే ఒక్క ఐపీఎల్ లోనే సాధ్యం. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి ధోనిని దగ్గర నుంచి చూసే భాగ్యం కలుగుతుందని ఫ్యాన్స్ భావిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ లో ధోనీ ఆడనున్నాడు.
రానున్న ఐపీఎల్ లో...
ఇక 2025 ఐపీఎల్ కు ధోనీ ఆడతాడా? లేదా? అన్న సందేహాలు అనేకం ఉన్నాయి. ఈ సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది. అయితే ఎంత మందిని రిటైన్ చేసుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. బీసీసీఐ నిర్ణయం మేరకే మహేంద్ర సింగ్ ధోనీ 2025 ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా? లేదా? అన్నది తేలనుంది. బీసీసీఐ ఎంతమందిని రిటైన్ తీసుకోవాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ ఐదు లేదా ఆరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటేనే ధోనీ వచ్చే ఐపీఎల్ లో ఆడేందుకు ఛాన్స్ ఉంది. లేకపోతే లేదు. అందుకే ధోనీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు బీసీసీఐ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story