Mon Dec 23 2024 20:27:10 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ఆయనే
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడుగా జగన్మోహన్ రావు నిలిచారు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడుగా జగన్మోహన్ రావు నిలిచారు. హెచ్.సీ.ఏ. ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్.సీ.ఏ. ప్యానెల్ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడిన జగన్మోహన్ రావు తన ప్రత్యర్థి అమర్ నాథ్ పై 2 ఓట్ల తేడాతో నెగ్గారు. ఉప్పల్ స్టేడియంలో ఈ ఎన్నికలు చేపట్టారు. హెచ్ సీఏ సభ్యుల సంఖ్య 173 కాగా, 169 మంది ఓటు వేశారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, మిథాలీ రాజ్, ప్రజ్ఞాన్ ఓజా, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షుడు- జగన్మోహన్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్.సీ.ఏ. ప్యానెల్)
ఉపాధ్యక్షుడు- దల్జీత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)
కార్యదర్శి- దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)
సంయుక్త కార్యదర్శి- బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)
ట్రెజరర్- సీజే శ్రీనివాసరావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్.సీ.ఏ. ప్యానెల్)
కౌన్సిలర్- సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)
Next Story