Mon Nov 18 2024 00:43:29 GMT+0000 (Coordinated Universal Time)
Jasprit Bumrah : భారత్ కు దొరికిన అదృష్టం అందుకే బుమ్రా అంటే అంత క్రేజ్
ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్‌లో జస్ప్రిత్ బుమ్రా నెంబర్ వన్ గా నిలిచాడు
ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్‌లో జస్ప్రిత్ బుమ్రా నెంబర్ వన్ గా నిలిచాడు. ఇంగ్లండ్ తో ముగిసిన రెండు టెస్ట్‌లు తర్వాత ఈ ఘనతను సాధించాడు. తొలి రెండు మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో వీర విహారం చేశారు. ప్రత్యర్థి ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కను రెప్ప మూసి తెరిచే లోగా వెనకాల ఉన్న వికెట్లు ఎగిరిపడటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆశ్చర్యానికి గురయ్యారంటే బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా బంతి విసిరితే ఎటు వైపు వస్తుందో తెలియక తికమక పడ్డారు.
ప్రత్యర్థులకు హడల్...
హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా విశాఖలో జరిగిన మ్యాచ్ లోనూ తొమ్మిది వికెట్లు తీసి ప్రత్యర్థి ఇంగ్లండ్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచిందంటే బుమ్రాయే కారణమని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. అందుకే ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అయ్యాడు. దీంతో ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచాడు. మూడు స్థానాలు దాటి నెంబర్ వన్ కు చేరకున్న బుమ్రా అసాధారణ ప్రతిభను అందరూ గుర్తించాల్సిందే.
తక్కువ పరుగులు.. ఎక్కువ వికెట్లు...
భారత్ కు దొరికిన అదృష్టం బుమ్రా అనే అనుకోవాల్సి ఉంటుంది. బుమ్రా ఉంటే అదొక ధైర్యం. పరుగులు ఎక్కువ ఇవ్వకుండా వికెట్లు తీయడంలో మేటి. బ్యాటింగ్ లో కోహ్లి ఫ్యాన్స్ కు ఎంత ధైర్యాన్నిస్తాడో బౌలింగ్ టైంలో బుమ్రా కూడా అంతే. బుమ్రా బౌలింగ్ ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. కేవలం టెస్ట్‌లే కాదు, వన్డేలు, టీ 20లలో కూడా బుమ్రా తానేంటో నిరూపించుకున్నాడు. మూడు ఫ్మార్మాట్లలో నెంబర్ వన్ రయాంకు సాధించిన రెండో ఆసియా ఆటగాడుగా బుమ్రా క్రెడిట్ సంపాదించుకుననారు. విరాట్ కోహ్లి కూడా అంతే మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా గతంలో నిలిచాడు.
Next Story