Sat Dec 28 2024 22:03:13 GMT+0000 (Coordinated Universal Time)
బుమ్రా ఫిట్నెస్ పై రాహుల్ ద్రావిడ్ చెబుతోంది ఇదే..!
భారత జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)కి వెళ్లాడని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.
భారత జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)కి వెళ్లాడని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. బుమ్రా గాయపడ్డాడనే వార్త భారత క్రికెట్ అభిమానులను కలవరపెడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా ద్రవిడ్ మాట్లాడుతూ అతని గాయంపై అధికారిక ధృవీకరణ కోసం టీమ్ మేనేజ్మెంట్ వేచి ఉందని అన్నారు. బుమ్రా వెన్నులో గాయం కారణంగా 2022 T20 ప్రపంచ కప్‌కు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రపంచ కప్ కోసం బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై.. BCCI నుండి అధికారిక సమాచారం లేదు. బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరగాల్సిన రెండు T20I మ్యాచ్‌ల నుండి బుమ్రాను పక్కన పెట్టారు. మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రా స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్‌ని తీసుకుంటామని బీసీసీఐ సెప్టెంబర్ 30న ప్రకటించింది.
"ప్రస్తుతానికి బుమ్రా.. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ సిరీస్ నుండి అధికారికంగా మినహాయించబడ్డాడు. అతను NCAకి వెళ్లాడు. అధికారిక ధృవీకరణ కోసం మేము ఎదురుచూస్తున్నాము. అధికారికంగా, అతను ఈ సిరీస్‌కు మాత్రమే దూరంగా ఉన్నాడు, రాబోయే కొద్ది రోజుల్లో ఏమి జరుగుతుందో చూద్దాం. అధికారిక ధృవీకరణ రాగానే ఆ విషయాలను మీతో పంచుకోగలుగుతాము, "అని విలేకరుల సమావేశం ద్రవిడ్ పేర్కొన్నారు. "నిజాయితీగా చెప్పాలంటే నేను మెడికల్ రిపోర్టులను లోతుగా పరిశీలించలేదు. ఏమి జరుగుతుందో తెలుసుకోడానికి నేను నిపుణులపై ఆధారపడతాను. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో.. మనకు తగిన సమయంలో తెలుస్తుంది.' అని ద్రవిడ్ అన్నారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదని స్పష్టం చేశారు. వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉండడంతో, టోర్నీలో బుమ్రా ఆడే అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేమని అన్నారు.
Next Story