Mon Dec 23 2024 09:16:53 GMT+0000 (Coordinated Universal Time)
బుమ్రా బౌలింగ్ లో.. అయ్యో రోహిత్ శర్మ
ఎక్కువ మందికి ప్రాక్టీస్ అవకాశం కల్పించేందుకు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రిషబ్ పంత్, చతేశ్వర్ పుజారా
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం లీసెస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఇది అనధికార మ్యాచ్ కావడంతో ఎక్కువ మందికి ప్రాక్టీస్ అవకాశం కల్పించేందుకు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రిషబ్ పంత్, చతేశ్వర్ పుజారా లీసెస్టర్‌షైర్ తరఫున బరిలోకి దిగారు. భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. లీసెస్టర్ కౌంటీ బౌలర్లతో పాటు బుమ్రా, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
బుమ్రా-రోహిత్ శర్మ.. ఈ ఇద్దరూ ఒకే జట్టులోని సాగుతూ ఉన్నారు. ఐపీఎల్ లో కూడా వీరు ముంబైకి కలిసి ఆడుతున్నారు. నెట్స్ లో మాత్రమే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనే రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్ లో కాస్త ఇబ్బంది పడ్డాడు. బుమ్రా వేసిన బంతులకు రోహిత్ శర్మ ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ బంతి రోహిత్‌కు గజ్జల్లో బలంగా తగిలింది. నొప్పికి తట్టుకోలేక భారత కెప్టెన్ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు. జట్టు ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్ కొనసాగించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇక టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోవడంలో విఫలమైంది.
కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రోజంతా నిలబడి అజేయంగా నిలిచాడు. దీంతో గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (25; 3 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (21; 4 ఫోర్లు), హనుమ విహారి (3), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశ పరిచారు. విరాట్ కోహ్లి (69 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించాడు. రవీంద్ర జడేజా (13) కూడా విఫలమవడంతో 81 పరుగులకే భారత్ 5 ప్రధాన వికెట్లను కోల్పోయింది. కోహ్లితో జతకట్టిన శ్రీకర్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాక కోహ్లి నిష్క్రమించాడు. శార్దుల్ ఠాకూర్ (6) పెవిలియన్ చేరగా.. టెయిలెండర్లలో ఉమేశ్ యాదవ్ (23; 4 ఫోర్లు), షమీ (18 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) సహాకారం ఇవ్వడంతో భరత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లీస్టర్‌షైర్ బౌలర్లలో రోమన్ వాకర్ 5 వికెట్లు పడగొట్టగా, విల్ డేవిస్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత ఆటగాళ్లలో అందరికీ ప్రాక్టీస్ కల్పించాలన్న ఉద్దేశంతో నలుగురు ప్రధాన ఆటగాళ్లు బుమ్రా, రిషభ్ పంత్, చతేశ్వర్ పుజారా, ప్రసిధ్ కృష్ణలను లీస్టర్‌షైర్ తరఫున ఆడించారు. వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో తొలిరోజు 60.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది.
News Summary - Jasprit-Bumrah-Hurts-Rohit-Sharma-Warm-up game
Next Story