Mon Nov 25 2024 16:04:08 GMT+0000 (Coordinated Universal Time)
KL Rahul: అడ్డంగా ఇరుక్కుపోయిన కేఎల్ రాహుల్
వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్‌ను
వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడం లేదు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). భారత తదుపరి ప్రధాన కోచ్ కోసం వేట కొనసాగుతోంది. ఈ పదవికి సంబంధించి హై-ప్రొఫైల్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఉన్న వ్యక్తుల్లో ఒకరైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాజకీయాలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఐపీఎల్-2024 సమయంలో ఈ మేరకు కేఎల్ రాహుల్‌తో ఈ విషయం గురించి తాను మాట్లాడానని లాంగర్ వివరించాడు. ఐపీఎల్ కోచ్‌తో పోల్చితే టీమిండియా హెడ్ కోచ్‌గా 1000 రెట్ల కంటే ఎక్కువ రాజకీయాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ రాహుల్ చెప్పాడని అన్నాడు.
‘‘నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడాను. ఐపీఎల్ జట్టులో ఒత్తిడి, రాజకీయాలు ఉన్నాయనుకుంటే.. దానికి వెయ్యి రెట్లు భారత్ కోచ్ పదవి అని రాహుల్ చెప్పాడు. ఇది మంచి సలహాగా నేను భావించాను’’ అని లాంగర్ తెలిపాడు. అయితే కేఎల్ రాహుల్ పర్సనల్ గా చెప్పిన వ్యాఖ్యలను లాంగర్ బయట పెట్టేయడంతో అసలు రచ్చ జరుగుతోంది. బీసీసీఐలో కూడా రాజకీయాలు ఆ స్థాయిలో ఉంటాయా అని అందరూ షాక్ అవుతూ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటూ ఉన్నారు.
Next Story