Mon Mar 31 2025 12:46:30 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England : ఈరోజు చూసినోళ్లకు చూసినంత.. పరుగుల వరద .. భారీ స్కోరు తప్పదట
భారత్ - ఇంగ్లండ్ చివరి వన్డే నేడు జరగనుంది. అహ్మదాబాద్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది

భారత్ - ఇంగ్లండ్ చివరి వన్డే నేడు జరగనుంది. అహ్మదాబాద్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే ఉద్దేశ్యంలో భారత్ ఉంది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్నభారత్ ఈ మ్యాచ్ ను కూడా గెలిచి తమ సత్తా చాటాలనుకుంటుంది. రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో ఇక ఇబ్బంది ఏమీ లేదు. విరాట్ కోహ్లి కూడా ఫామ్ లోకి వచ్చాడంటే ఎంత స్కోరు అయినా సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించనుంది. ఫామ్ అనేది ఒక్కోసారి కొన్ని నెలల పాటు వేదిస్తుంది. అది అభిమానులన కూడా కలవరపెడుతుంది. గత కొద్ది రోజులుగా సీనియర్ ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శన చేస్తుండటంతో జట్టును గెలిపించే బాధ్యత కుర్రాళ్లపై పడుతుంది.
ఇద్దరు ఫామ్ లోకి వస్తే...
ఆ భారాన్ని మోయడానికి వారికిఉన్న అనుభవం శక్తి, యుక్తులు సరిపోవడం లేదు. అయినా రెండు మ్యాచ్ లలో బాగా ఆడి జూనియర్లు భారత్ జట్టును గెలుపు బాట పట్టించారు. ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న సమయంలో సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లోకి వస్తే ఇక భారత్ కు తిరుగుండదు. ఇక విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఒకసారి ఇద్దరూ ఫామ్ లోకి వస్తే భారత్ కు ఇక ఎదురుండదు. కోహ్లి ఈ మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేయాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ ను నిర్మించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇలా సీనియర్లు ఈ మ్యాచ్ లో రాణించాలని కోరుకుంటున్నారు.
రెండు జట్లు...
అదే సమయంలో భారత్ ఎలాగయితే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుందో? ఇంగ్లండ్ సయితం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి తమ జట్టులో సామర్ధ్యానికి ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలని భావిస్తుంది. భారత్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. అలాగే ఇంగ్లండ్ జట్లులో కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పరుగులకు కొదవ ఉండదు. ఇది బ్యాటింగ్ కు అనుకూలమైన మైదానం కావడంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయి. అదే సమయంలో స్పినర్లకు కూడా ఈ స్టేడియం సహకరిస్తుండటంతో భారత్ కు అనుకూలించే అంశంగా చూడాలి. అందుకే అనేక షాట్లతో ఈ స్టేడియంలో బాల్ ఎటు వైపు వెళుతుందో చెప్పలేని పరిస్థితి.
Next Story