Fri Dec 20 2024 10:05:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భారత్ - న్యూజిలాండ్ చివరి టీ 20
భారత్ - న్యూజిలాండ్ చివరి టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ఇది కీలక మ్యాచ్. ఈరోజు జరిగే మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది.
భారత్ - న్యూజిలాండ్ చివరి టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. ఇది కీలక మ్యాచ్. ఈరోజు జరిగే మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరి ఒక మ్యాచ్ గెలిచి చెరొక పాయింట్ తో సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ దక్కుతుంది. భారత్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఎంతో మెరుగుపర్చుకోవాల్సి ఉందంటున్నారు. కొన్ని మార్పులు చేసే అవకాశముందని చెబుతున్నారు.2012 నుంచి న్యూజిలాండ్ ఏ సిరీస్ లోనూ భారత్ లో నెగ్గలేదు.
సిరీస్ గెలుచుకోవాలంటే...
ఈ సిరీస్ గెలుచుకోవాలని న్యూజిలాండ్ శక్తివంచన లేకుండా పోరాడుతుంది. ఆ జట్టులో ఆల్ రౌండర్లు అనేక మంది ఉండటం అనుకూల అంశం. అయితే భారత్ జట్టు ఓపెనర్లు తడబడుతుండటం కొంత ఆందోళన కలిగిస్తుంది. శుభమన్ గిల్ రాణించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో గిల్ ను ఆడిస్తారా? పక్కన పెట్టి పృథ్వీషాను తీసుకు వస్తారా? అన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద భారత్ - న్యూజిలాండ్ చివరి టీ 20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగానే సాగనుంది.
- Tags
- india
- new zealand
Next Story