Tue Nov 05 2024 23:26:46 GMT+0000 (Coordinated Universal Time)
బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ
భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1966 నుంచి 1979 వరకు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1946 సెప్టెంబర్ 25న జన్మించిన బిషన్ సింగ్ బేడీ 67 టెస్ట్ మ్యాచుల్లో 266 వికెట్లు తీసుకున్నారు. పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో బిషన్ సింగ్ బేడీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్ తొలి వన్డే మ్యాచ్ విజయంలో బేడీ కీలకపాత్ర పోషించారు. 1975 ప్రపంచ కప్ మ్యాచ్లో తూర్పు ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 12-8-6-1 అద్భుతమైన బౌలింగ్ గణాంకాలను నమోదు చేశారు.
బేడీ తన ఫ్లైట్, స్పిన్ డెలివరీలతో బ్యాట్స్మెన్ ను బాగా ఇబ్బంది పెట్టేవారు. 1971లో భారత్.. ఇంగ్లండ్పై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకోవడంతో ఆయన నాయకత్వానికి గొప్ప పేరు వచ్చింది. దేశవాళీ క్రికెట్ లో కూడా బేడీ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఏకంగా 1560 వికెట్లు తీసిన రికార్డు బిషన్ సింగ్ బేడీది. 370 మ్యాచ్ ల్లో ఆయన ఈ ఘనతను సాధించారు. భారత్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బిషన్ సింగ్ బేడీ చరిత్ర సృష్టించారు. ఆయనకు 1970లో కేంద్ర ప్రభుత్వం.. పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసింది. 2004లో సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు కూడా అందుకున్నారు.
Next Story