Mon Dec 23 2024 05:35:37 GMT+0000 (Coordinated Universal Time)
నేను 'గే'.. నిజాన్ని దాచలేను
41 ఏళ్ల ఇకర్ కాసిల్లాస్ స్పెయిన్, రియల్ మాడ్రిడ్ లకు అద్భుతమైన విజయాలను అందించాడు.
స్పెయిన్, రియల్ మాడ్రిడ్ గోల్ కీపర్ ఇకర్ కాసిల్లాస్ తాను గే అని చెప్పుకొచ్చారు. తాను స్వలింగ సంపర్కుడినంటూ లెజెండరీ గోల్ కీపర్ ఇకర్ కాసిల్లాస్ వెల్లడించారు. "మీరు నన్ను గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను: నేను స్వలింగ సంపర్కుడిని." అని స్పానిష్‌లో ట్వీట్ చేశారు. మార్చి 2021లో విడిపోవడానికి ముందు కాసిల్లాస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సారా కార్బోనెరోతో ఐదు సంవత్సరాలు వివాహ బంధంలో ఉన్నాడు ఇకర్ కాసిల్లాస్ . వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇకర్ కాసిల్లాస్ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో చాలా మద్దతు లభించింది. అతని మద్దతుదారుల్లో ఒకరు బార్సిలోనా మాజీ కెప్టెన్ కార్లెస్ పుయోల్ కూడా ఉన్నారు.
41 ఏళ్ల ఇకర్ కాసిల్లాస్ స్పెయిన్, రియల్ మాడ్రిడ్ లకు అద్భుతమైన విజయాలను అందించాడు. స్పెయిన్ కు ప్రపంచ కప్, రియల్ మాడ్రిడ్ కు రెండు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లు, ఐదు లా లిగా ఛాంపియన్‌షిప్‌లు, మూడు ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌లను అందించాడు. ఇకర్ కాసిల్లాస్ రియల్ మాడ్రిడ్ తో 25 సంవత్సరాలు గడిపాడు. తొమ్మిదేళ్ల వయస్సులో రియల్ మాడ్రిడ్ బృందంలో చేరాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ సారా కార్బోనెరోను కాసిల్లాస్ వివాహం చేసుకుని, మార్చి 2021లో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇద్దరూ ఐదు సంవత్సరాల పాటు వివాహ బంధంలో ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. రియల్ మాడ్రిడ్ మాజీ కెప్టెన్ గత సంవత్సరం తన భార్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించాడు, తమ పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతామని చెప్పారు.
Next Story