Manu Bhaker Bhagavad Gita భగవద్గీత ఎంతో నేర్పింది: మను భాకర్
పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన షూటర్ మను భాకర్ తన
పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన షూటర్ మను భాకర్ తన విజయంపై మాట్లాడుతూ భగవద్గీత నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. పతకం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫైనల్ రౌండ్ కు ముందు కూడా భగవద్గీతను చదివానని తెలిపింది. ఫలితం గురించి ఆలోచించలేదని ప్రయత్నం చేయడం మాత్రమే తన చేతిలో ఉందని నమ్ముతానని తెలిపింది. నువ్వు ఏం చేయగలవో అది చేయి. నువ్వు చేయాల్సిన కృషి చేయి. ఫలితాన్ని ఆశించకు.. అనే మాటలే తన మదిలో మెదిలాయని చెప్పింది. విధి రాతని మనం మార్చలేం. చేయాల్సిన పని మీదే దృష్టి పెట్టాలి.. ఫలితం మీద కాదు అంటూ భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడని. ఆ మాటలే నా మెదడులో కదిలాయని మను భాకర్ తెలిపింది. భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. భారత్ ఇంకా ఎక్కువ పతకాలు సాధించాలని, ఈసారి వీలైనన్ని ఎక్కువ పతకాలు దక్కుతాయని తాము ఎదురు చూస్తున్నామని ఆమె చెప్పింది.