Fri Nov 22 2024 20:00:00 GMT+0000 (Coordinated Universal Time)
India vs Afghanistan T20 : డబుల్ "ఆర్"లు ఇరగదీశారు... డబుల్ సెంచరీకి పరుగులను తీసుకెళ్లి
భారత్ - ఆప్ఘనిస్తాన్ ల మధ్య జరిగిన నిన్న మ్యాచ్లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ లు ఆడిన తీరు అద్భుతం
భారత్ - ఆప్ఘనిస్తాన్ ల మధ్య జరిగిన నిన్న మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా తొలి ఓవర్లు చూసి ఇంత చెత్త బ్యాటింగ్ ఏంటి అని అనిపించక మానదు. యశస్వి జైశ్వాల్ నాలుగు పరుగులకు అవుటయ్యాడు. కొహ్లి వచ్చి జీరో పరుగులకు వెనుదిరిగాడు. శివమ్ దూబే ఒక్కపరుగుకే వెళ్లిపోయాడు. సంజూశాంసన్ కూడా అంతే. దీంతో భారత్ ఫ్యాస్స్ లో అసహనం. అసలే రోహిత్ ఫామ్ లో లేడు. ఇక ఆట ముగిసినట్లేనని అనుకున్నారు. ఆ తర్వాత రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నప్పటికీ పెద్దగా వారిపై ఆశలు లేవు. అందుకే బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారింది. మూడో మ్యాచ్ భారత్ చేజారినట్లేనని అనుకున్నారు.
కెప్టెన్ ఇన్నింగ్స్...
కానీ రోహిత్ శర్మ తనపై వస్తున్న కామెంట్లకు చెక్ పెట్టాడు. నవ్విన వారికి ఆట అంటే ఇదేరా అంటూ చూపెట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్ని సిక్సర్లు కొట్టాడు. నిలకడగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతున్న రోహిత్ శర్మకు రింకూ సింగ్ తోడయ్యాడు. రింకూ సింగ్ కూడా తన దైన శైలితో ఆటను ఆడుతుండటంతో భారత్ అభిమానుల్లో ఒకరకమైన ఆనందం కనిపించింది. పది ఓవర్లకు వంద పరుగులు కూడా చేయకపోవడతో స్కోరు 130 కి దాటదని భావించారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ విజృంభించి ఆడి భారత్ కు భారీ స్కోరు తెచ్చి పెట్టారు. రోహిత్ శర్మ 121 పరుగులు టీ 20 చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. 121 పరుగుల్లో ఎనిమిది సిక్స్లు 11 ఫోర్లు ఉన్నాయి.
టీ 20 స్పెషలిస్ట...
అలాగే రింకూ సింగ్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాలుగు ముఖ్యమైన వికెట్లు పడిపోయినా ఇటు దూకుడుగా ఆడుతూనే మరొక వైపు రోహిత్ కు అండగా నిలుస్తూ భారత్ స్కోరును పెంచేందుకు తోడ్పడ్డాడు. రింకూ సింగ్ 69 పరుగుల్లో ఆరు సిక్స్లను బాదాడంటే అతడి సామర్ధ్యాన్ని గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. టీ 20 స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడానికి ప్రధాన కారణమయ్యాడు. అందుకే డబుల్ ఆర్ లు నిలకడగా ఆడుతూ భారత్ స్కోరును డబుల్ సెంచరీ గా మార్చి భారత్ కు విజయాన్ని అందించారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Next Story