Wed Apr 02 2025 05:04:05 GMT+0000 (Coordinated Universal Time)
Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో వరసగా నాలుగో విజయం... భారత్ కు తిరుగులేదుగా
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగింది.

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగింది. చివర వరకూ గెలుపు ఎవరదన్న దానపై సస్పెన్స్ నెలకొన్నా చివరకు భారత్ దే విజయాన్ని వరించింది. దీంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ కు ప్రవేశించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే గత రోజులు గుర్తుకు వచ్చి ఫ్యాన్స్ లో కొంత కలవరం ఉంది. అయితే దానిని పటాపంచలు చేస్తూ భారత్ ఆసీస్ ను ఓడించింది. చాంపియన్స్ ట్రోఫీలో వరసగా నాలుగో విజయాన్ని అందుకున్న భారత్ ఆదివారం దుబాయ్ లో జరిగే ఫైనల్ లోతలపడనుంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆసిస్ బ్యాటర్లను నిలువరించడంలో మన బ్యాటర్లు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.
డ్రై పిచ్ కావడంతో...
దుబాయి్ లోని డ్రై పిచ్ మీద ఆస్ట్రేలియా బ్యాటర్లు 264 పరుగులు చేయగలిగారు. హెడ్ ను త్వరగా పెవిలియన్ బాట పట్టించినప్పటికీ స్మిత్, క్యారీ నిలబడి ఇంతటి భారీ స్కోరును సాధించారు. తిరిగి షమి మూడు వికెట్లు తీసుకున్నాడు. జడేజా, వరుణ్ చక్రవర్తి లు చెరి రెండు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా చెరో ఒకటి తీసుకున్నారు. 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచడంతో ఛేదనలో కష్టమేనని అనిపించింది. ఎందుకంటే రాను రాను బౌలర్లకు అనుకూలంగా పిచ్ మారుతుందన్న క్రీడా నిపుణుల అంచనాలు భారత్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేశాయి. అయితే భారత్ మాత్రం నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది.
మరొకసారి కోహ్లి...
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో శుభమన్ గిల్, రోహిత్ శర్మ మరొక సారి విఫలమయ్యారు. అయితే విరాట్ కోహ్లీ తో శ్రేయస్ అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యం అభిమానుల ఆశలను పెంచేలా చేసింది. సింగిల్ రన్స్ తీస్తూనే అప్పుడప్పుడూ ఫోర్లు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే శ్రేయస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఇద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో కొంత కంగారు మొదలయింది. అయితే అక్షర్ పటేల్ వచ్చి తన స్టయిల్ లో ఆడాడు. కోహ్లి మొత్తం 84 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యాలు కలసి ఆస్ట్రేలియా బౌలర్లను చితక బాదారు. దీంతో భారత్ ఫైనల్స్ లోకి సగర్వంగా అడుగు పెట్టగలిగింది.
Next Story