ఇద్దరు స్టార్ స్పిన్నర్లు లేకుండానే ప్రపంచ కప్ టీమ్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ రాబోయే ప్రపంచ కప్-2023 కోసం తన డ్రీమ్ టీమిండియాను ప్రకటించాడు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ రాబోయే ప్రపంచ కప్-2023 కోసం తన డ్రీమ్ టీమిండియాను ప్రకటించాడు. హేడెన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లను జట్టు నుండి తొలగించాడు.
హేడెన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “సంజూ శాంసన్‌ని టీమ్‌లో చూడడానికి నేను ఇష్టపడతాను. భారత్‌కు బ్యాట్స్‌మెన్ కంటే ఆల్ రౌండర్లు ఎక్కువ అవసరం. కాబట్టి తిలక్ వర్మ కంటే అక్షర్ పటేల్ మంచి ఎంపిక అని పేర్కొన్నాడు.
కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ లను జట్టుకు దూరంగా ఉంచిన హేడెన్.. వారి స్థానంలో శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌లకు జట్టులో చోటు కల్పించాడు.
అయితే.. ఆసియా కప్‌కు ప్రకటించిన భారత జట్టులో కుల్దీప్ చోటు దక్కించుకున్నాడు. గత 9 వన్డేల్లో కుల్దీప్ 18 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. శాంసన్‌ను మాత్రం ఆసియా కప్‌లో బ్యాకప్ ప్లేయర్‌గా చేర్చారు. కేఎల్ రాహుల్ ఆడకపోతే అతను జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. సంజూ శాంసన్ గత ఏడాది IPL సీజన్లో రాణించినప్పటికీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇక అక్షర్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన చేయడం చూడవచ్చు. అక్షర్.. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లోటును పూరించే అవకాశం ఉంది.
15 మందితో డ్రీమ్ టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్.