Sun Dec 22 2024 21:02:05 GMT+0000 (Coordinated Universal Time)
కమిన్స్ రికార్డు బద్దలు.. మిచెల్ స్టార్క్ పై కోట్ల వర్షం
ఐపీఎల్ మినీ వేలంలో రికార్డులు నమోదవడమే కాకుండా.. ఆ రికార్డులు బద్దలు కూడా
ఐపీఎల్ మినీ వేలంలో రికార్డులు నమోదవడమే కాకుండా.. ఆ రికార్డులు బద్దలు కూడా అయిపోతున్నాయి. పాట్ కమిన్స్ ను 20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకోగా.. మిచెల్ స్టార్క్ కోసం భారీగా బిడ్డింగ్ వార్ జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ కమిన్స్ కోసం ఊహించని విధంగా పోటీ పడ్డాయి. 2023 ఐపీఎల్ ఆడని 33 సంవత్సరాల మిచెల్ స్టార్క్ విషయంలో ఊహించని వేలంపాట జరిగింది. చివరికి కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 24.75 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.
వేలం పాటలో కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల రికార్డు ధరతో చేజిక్కించుకుంది. కమిన్స్ కోసం సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు హోరాహోరీ తలపడ్డాయి. ప్యాట్ కమిన్స్ కనీస ధర రూ.2 కోట్లు కాగా సన్ రైజర్స్, బెంగళూరు ఫ్రాంచైజీలు వేలంలో పోటీ పడడానికి సిద్ధపడ్డాయి. సన్ రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఆసీస్ కెప్టెన్ కోసం ఏ మాత్రం వెనుకాడలేదు. కమిన్స్ రేటు రూ.20.50 కోట్ల మార్కుకు చేరుకుంది. ఆ తర్వాత ఆర్బీబీ వేలం నుంచి విరమించుకోవడంతో, ఈ ఆసీస్ చాంపియన్ కెప్టెన్ సన్ రైజర్స్ సొంతమయ్యాడు.
Next Story