Mon Dec 23 2024 11:31:59 GMT+0000 (Coordinated Universal Time)
2 2 W W W W.. ఒకే ఒక్క ఓవర్ లో ఆస్ట్రేలియాను కమ్మేసిన మొహమ్మద్ షమీ
మొహమ్మద్ షమీ.. అసలు జట్టులో ఉంటాడా లేదా అని అందరూ భావించారు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా మొదట బౌలింగ్ వేయడానికి రాలేదు. ఇక ఇదే టీమ్ తో ముఖ్యమైన మ్యాచ్ లలో భారత్ ఆడుతుందని భావించారు. కానీ ఆఖర్లో ఒకే ఒక్క ఓవర్ వేయడానికి షమీని రంగంలోకి దించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
2 2 W W W W.. విజయానికి ఆస్ట్రేలియాకు రెండు పరుగులు కావాల్సి ఉండగా.. మొదటి రెండు బంతులకు.. రెండేసి సింగిల్స్ తిరిగారు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్.. అయితే ఆ తర్వాత వేసిన బంతికి కమిన్స్ భారీ షాట్ ఆడాడు. లాంగాన్ లో ఉన్న కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్ ను అందుకోవడంతో.. భారత్ కు మ్యాచ్ పై పట్టు సాధించే అవకాశం దక్కింది. ఆ తర్వాత బంతికి ఆస్టన్ అగర్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. డాట్ అయింది. కీపర్ దినేష్ కార్తీక్ బంతిని తీసుకుని షమీకి అందించగా.. షమీ అగర్ ను రనౌట్ చేసేశాడు. ఆ తర్వాతి బంతికి జాన్ ఇంగ్లిష్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఆఖరి బంతికి రిచర్డ్సన్ కూడా బౌల్డ్ అవ్వడంతో భారత్ ఈ థ్రిల్లర్ లో విన్నర్ గా నిలిచింది. ఒకే ఒక్క ఓవర్ వేసిన షమీ.. భారత బౌలింగ్ యూనిట్ లో పదును తగ్గలేదని అభిమానులకు ఓ సందేశం పంపించాడు.
Next Story