Fri Dec 27 2024 11:16:14 GMT+0000 (Coordinated Universal Time)
Mohammad shami: ఆసుపత్రి బెడ్ పై షమీ.. ఇంతకూ ఏమైందంటే?
షమీ తన సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాలను పంచుకున్నాడు. అతని గాయంపై అప్డేట్ ను
Mohammad shami:భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గతేడాది వన్డే వరల్డ్ కప్లో షమీ గాయపడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో షమీకి తాజాగా సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.
షమీ తన సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాలను పంచుకున్నాడు. అతని గాయంపై అప్డేట్ ను ఇచ్చాడు. యునైటెడ్ కింగ్డమ్లో విజయవంతమైన ఆపరేషన్ చేయించుకున్నట్లు తన అభిమానులకు తెలియజేశాడు. 2023 ODI ప్రపంచ కప్ సమయంలో షమీ గాయపడ్డాడు. నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓటమి తర్వాత ఎటువంటి క్రికెట్ ఆడలేదు షమీ. ప్రపంచ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన T20I హోమ్ సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు షమీ తప్పుకున్నాడని, యునైటెడ్ కింగ్డమ్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని కొద్ది రోజుల క్రితం ఐసీసీ ప్రకటించింది. ముందుగా అనుకున్నదానికంటే గాయం మరింత తీవ్రంగా మారింది. షమీ ఐపీఎల్ కు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షమీ కోలుకుని తిరిగి భారత జట్టులోకి రావాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.
Next Story