Fri Nov 22 2024 19:56:40 GMT+0000 (Coordinated Universal Time)
వన్డేల్లో నంబర్ 1.. మన హైదరాబాదీనే
ఆసియా కప్ ఫైనల్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్
ఆసియా కప్ ఫైనల్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో మహ్మద్ సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా కప్లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడంతో సిరాజ్ టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్నాడు. సిరాజ్ ఖాతాలో ప్రస్తుతం 694 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు గత మార్చిలో సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు మరోసారి నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ప్రపంచ కప్ కు ముందు సిరాజ్ కు నంబర్ 1 స్థానం దక్కడం నిజంగా విశేషం.
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్ ఖాతాలో 857 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. శుభ్మన్ గిల్ 814 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వాన్ డర్ డ్యూసెన్ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (708) ఎనిమిదో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (696) పదవ స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ జాబితాలో షకీబ్ ఉల్ హాసన్ (371) టాప్లో ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి హార్దిక్ పాండ్యా (243) ఆరో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్లో 83 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఫలితంగా ICC ODI ర్యాంకింగ్స్లో ఇరవై స్థానాలు ఎగబాకి ఏకంగా 9వ స్థానానికి చేరుకున్నాడు.
Next Story