Sun Dec 22 2024 20:49:25 GMT+0000 (Coordinated Universal Time)
అదిదా ధోని సార్ రేంజ్.. ఎవరితో గోల్ఫ్ ఆడారంటే?
అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా టూర్ లో ఉన్న ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా టూర్ లో ఉన్న ధోని బిజీబిజీగా గడుపుతున్నాడు.న్యూయార్క్ లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ లో అల్కరాజ్, జ్వెరెవ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చూశాడు ధోనీ. ఇప్పుడు ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడాడు.
ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ కు ధోనీని ఆహ్వానించిన ట్రంప్ సరదాగా గోల్ఫ్ ఆడారు. ఈ ఫొటోలను హితేష్ సంఘ్వి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ధోనీ, ట్రంప్ లతో గోల్ఫ్ ఆడుతున్నాం.. థ్యాంక్యూ అనే క్యాప్షన్ తో హితేష్ ఈ ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారిపోయాయి. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త అయిన హితేష్ సంఘ్వి ఈ అమెరికా ట్రిప్ లో ధోనీతోనే ఉన్నాడు. దీంతో ఈ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఆయన తన ఇన్స్టాలో షేర్ చేస్తున్నారు. యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చూస్తున్న ఫొటోలను కూడా ఈయనే పోస్ట్ చేశారు.
కార్లోస్ అల్కరాజ్ vs అలెగ్జాండర్ జ్వెరెవ్ US ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎంఎస్ ధోని కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూయార్క్ లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలను ధోనీ ఆస్వాదించాడు. యూఎస్ ఓపెన్ లో వరల్డ్ నెంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ధోనీ కూడా హాజరయ్యాడు. అల్కరాజ్ బెంచ్ కు వెనుకగా కూర్చుకున్న ధోనీ పలుమార్లు టీవీలో కనిపించాడు. ధోని మళ్లీ లాంగ్ హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ ఉన్నాడు.
Next Story