Sun Dec 22 2024 20:17:08 GMT+0000 (Coordinated Universal Time)
క్రిమినల్ కేసు పెట్టిన మహేంద్ర సింగ్ ధోని
ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు చెందిన
ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్ లపై క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీని నెలకొల్పేందుకు దివాకర్ 2017లో MSDతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో పేర్కొన్న షరతులను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ కోర్టును ఆశ్రయించారు. రిమైండర్లు, లీగల్ నోటీసులు కూడా పంపినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నారు.
ముందు ధోనీ ఆగస్ట్ 15, 2021న ఆర్కా స్పోర్ట్స్‌కు మంజూరు చేసిన అధికార లేఖను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత అనేక చట్టపరమైన నోటీసులను పంపించాడంట. కానీ, ప్రయోజనం లేకపోయినట్లు అందులో పేర్కొన్నాడు. విధి అసోసియేట్స్ ద్వారా MS ధోనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దయానంద్ సింగ్, ఆర్కా స్పోర్ట్స్ కారణంగా తాము మోసపోయామని, ఫలితంగా రూ. 15 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్కు చెందిన ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరిద్దరూ ధోనీ సొంత రాష్ట్రమైన రాంచీకి చెందినవారు.
Next Story