Sun Dec 22 2024 20:35:22 GMT+0000 (Coordinated Universal Time)
కేక పుట్టిస్తున్న మహేంద్ర సింగ్ ధోని కొత్త హెయిర్ స్టైల్
మహేంద్ర సింగ్ ధోని.. ఆయనకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం
మహేంద్ర సింగ్ ధోని.. ఆయనకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహీ తన హెయిర్ స్టైల్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆ లాంగ్ హెయిర్ తో ధోని వస్తుంటే హాలీవుడ్ కటౌట్ వస్తోందని చెప్పేవారు. కానీ ఎందుకో ధోని లాంగ్ హెయిర్ ను కంటిన్యూ చేయలేదు. కానీ ఇటీవల బాగా హెయిర్ ను పెంచేసిన ధోని వింటేజ్ లుక్ తో అభిమానులను అలరించడానికి సిద్హమయ్యాడు.
మరోసారి ధోని లూజ్ హెయిర్ తో కనిపించాడు. బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని అభిమానులను కొత్త స్టైల్ తో షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'కెప్టెన్ కూల్' గా పిలువబడే ధోని శైలిని కాపీ చేయడానికి అభిమానులు ప్రయత్నిస్తూ ఉంటారు. ధోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా.. ధోని కొత్త హెయిర్‌స్టైల్‌ను ప్రముఖ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పంచుకున్నారు. ధోని టీమిండియాలో చోటు సంపాదించుకున్న కొత్తలో పొడవాటి జుట్టుతో ఉండేవాడు. 2007లో ICC T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తర్వాత తన హెయిర్‌స్టైల్‌ను మార్చుకున్నాడు. ఇప్పుడు మరో సారి తన లుక్ తో అభిమానులను మెస్మరైజ్ చేశాడు ధోని.
Next Story