Mon Dec 23 2024 07:19:02 GMT+0000 (Coordinated Universal Time)
MS Dhoni : వారెవ్వా.. నాలుగు పదుల వయసులో.. న్యూ లుక్ లో అదరగొట్టేశాడుగా?
ఎంఎస్ ధోనీ అంటే అదో క్రేజ్..అరంగ్రేటంతోనే అదరగొట్టేశాడు. కేవలం ఆటతోనే కాదు. లుక్ తోనే అందరినీ ఆకట్టుకున్నాడు
ఎంఎస్ ధోనీ అంటే అదో క్రేజ్.. టీం ఇండియాలో అరంగ్రేటంతోనే అదరగొట్టేశాడు. కేవలం ఆటతోనే కాదు. లుక్ తోనే అందరినీ ఆకట్టుకున్నాడు. తొలుత టీం ఇండియాలో కనిపించిన ధోని జుట్టు వెనక వైపు వేలాడుతూ ఉండేది. దానిని చూసి మనమే కాదు.. అప్పట్లో పాక్ ప్రధాని ముషార్రాఫ్ కూడా ధోనీ స్టయిల్ కు ఫిదా అయ్యాడు. ధోనీ హెయిర్ స్టయిల్ తో నే కాదు.. వీర బాదుడుతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. దశాబ్దాల పాటు టీం ఇండియాకు ఆడి పేరు ప్రఖ్యాతులతో పాటు ఫ్యాన్స్ ను కూడా సొంతం చేసుకున్నాడు.
వేషధారణలోనూ...
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ కేవలం ఐపీఎల్ లోనే కనిపిస్తున్నాడు. అందుకే .. కేవలం ధోనిని చూసేందుకే ఐపీఎల్ ఆటను వీక్షించడానికి టీవీల వద్ద మాత్రమే కాదు... స్టేడియాలకు అభిమానులు పరుగులు తీస్తారంటే అతిశయోక్తి కాదు. కెప్టెన్ గా టీం ఇండియాకు ఎన్నో కప్ లను అందించిన మహేంద్రుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మొన్నటి వరకూ కెప్టెన్ గా ఉండి ఐదుసార్లు కప్ ను అందించాడు. అలా ఉంటుంది ధోనితోటి. అలాంటి ధోని ఆహార్యం, వేషధారణలోనూ వెరైటీగా కనిపిస్తాడు.
తాజాగా ఫొటోలు...
తాజాగా న్యూ లుక్ లో మహేంద్ర సింగ్ ధోనీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినీ హీరోలను మించిపోయేలా ధోనీ లుక్స్ ఉన్నాయంటున్నారు అభిమానులు. మైదానంలో మిస్టర్ కూల్ గా ఉండే ధోనీ.. ఆవలి వైపు మాత్రం అభిమానులను నిత్యం అలరించేలా వ్యవహరిస్తాడు. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కళ్లకు గాగుల్స్ పెట్టుకుని .. బ్లాక్ కలర్ టీ షర్ట్.. బ్లూకలర్ జీన్స్ తో కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. థోనీ భాయ్.. చాలా అందంగా ఉన్నావు.. వెరీ హ్యాండ్స్మ్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Next Story