Mon Dec 23 2024 17:07:17 GMT+0000 (Coordinated Universal Time)
Hardik Pandya. పాండ్యా ఉంటే గెలుపు ఖాయమనేనా? అందుకే అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న హార్థిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది
ఒక్కో ఆటగాడికి పెర్ఫార్మెన్స్ ను బట్టి డిమాండ్ ఉంటుంది. ఎప్పుడూ హిట్ అవ్వాలని లేదు కానీ... నిలకడగా ఆడుతున్నాడు అన్న పేరుంటే చాలు కాసుల వర్షం కురిసినట్లే. అదీ ఐపీఎల్లో. ఐపీఎల్ అంటే ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. సిక్సర్లు, ఫోర్లు కొట్టిన వాడే మొనగాడు. వికెట్లు తీసిన వాడు వీరుడు. ఆ రెండు కలిస్తే వాడే మనోడు. హార్ధిక్ ప్యాండ్యా. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న హార్థిక్ పాండ్యాకు ఐపీఎల్ లో గిరాకీ మామూలుగా ఉండదు. అతనినిని ఎంత సొమ్ము వెచ్చించైనా కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజెస్ సిద్ధపడుతుంటాయి.
గెలుపు గ్యారంటీ అని...
హార్ధిక్ పాండ్యా ఉంటే గెలుపు గ్యారంటీ అన్న సెంటిమెంట్ కూడా ఉంది. గుజరాత్ టైటాన్స్ రెండు సీజన్లలో ఫైనల్స్ కు చేర్చడమే కాకుండా 2022 లో ట్రోఫీని గెలుచుకునేలా చేశాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి వైదొలుగుతాడని గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం నిజమయింది. ముంబయి ఇండియన్స్ పాండ్యాను సొంతం చేసుకుంది. అయితే హార్థిక్ పాండ్యాకు ముంబయి ఇండియన్స్ను ఎంతకు కొనుగోలు చేసిందో తెలియకున్నా.. అత్యధిక ధరను వెచ్చిందన్నదే టాక్.
మరింత బలంగా...
హార్ధిక్ పాండ్యా రాకతో ముంబయి ఇండియన్స్ మరింత బలోపేతమయింది. హిట్టర్ గా కాకుండానే బౌలర్ గా రాణిస్తున్న హార్ధిక్ ను సొంతం చేసుకోవాలని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన సూచనను ఆ జట్టు మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకున్నట్లయింది. గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యా వైదొలగడంతో ఇప్పుడు ఆ జట్టుకు ఎవరు కెప్టెన్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సారి ట్రోఫినీ ముద్దాడాలన్న ఏకైక లక్ష్యంతోనే హార్ధిక్ పాండ్యాను ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందన్న ప్రచారం క్రీడా వర్గాల్లో నడుస్తుంది.
Next Story