Fri Dec 20 2024 05:43:40 GMT+0000 (Coordinated Universal Time)
Mumbai Indians: కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, మరి రోహిత్ శర్మ సంగతేంటి?
కొద్దిరోజుల కిందట ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రేడింగ్ జరిగినప్పుడు
కొద్దిరోజుల కిందట ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రేడింగ్ జరిగినప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే!! గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీని వదులుకుని మరీ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలను అందించింది.
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందజేసిన రోహిత్ శర్మ కెప్టెన్సీకి దూరమయ్యాడు. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ – 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా కొత్త సారథిగా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ ట్రేడ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది. గత పదేండ్లుగా రోహిత్ నాయకత్వంలో ఉన్న ముంబైకి కొత్త కెప్టెన్ వచ్చాడు. కెప్టెన్సీ మార్పుతో ముంబై ఇండియన్స్ టైటిల్స్ వేటకు దిగనుంది.
Next Story