Mon Nov 18 2024 18:19:18 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీలంక
ప్రపంచ కప్ లో శ్రీలంక ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది
ప్రపంచ కప్ లో శ్రీలంక ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్ జట్టుపై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 262 పరుగుల ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక ఇంకో 10 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
లక్నోలో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ (4), మాక్స్ ఓ డౌడ్ (16) విఫలం కాగా, వన్ డౌన్ లో వచ్చిన కోలిన్ అకెర్ మన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. బాస్ డీ లీడ్ (6), తేజ నిడమానూరు (9), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (16) మరోసారి నిరాశపరిచాడు. అయితే సైబ్రాండ్ ఎంగెల్ బ్రెక్ట్, లోగాన్ వాన్ బీక్ అద్భుతంగా ఆడడంతో నెదర్లాండ్స్ కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఎంగెల్ బ్రెక్ట్ 82 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 70 పరుగులు చేయగా, వాన్ బీక్ 75 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 59 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 4, కసున్ రజిత 4, మహీశ్ తీక్షణ 1 వికెట్లు తీశారు.
ఛేజింగ్ లో శ్రీలంక ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. ఓపెనర్ కుశాల్ పెరీరా 5 పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ నిస్సంక 54 పరుగులతో ఛేజింగ్ లో తోడ్పడ్డాడు. కెప్టెన్ కుశాల్ మెండిస్ ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. సదీర సమర విక్రమ 91 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అసలంక 44, ధనంజయ డిసిల్వా 30 పరుగులతో ఆకట్టుకున్నారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసుకున్నాడు.
Next Story