Fri Nov 22 2024 19:54:04 GMT+0000 (Coordinated Universal Time)
Rohith Sharma : రోహిత్ శర్మను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకయ్యా అంటూ?
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. టీ20ల నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు పెద్దయెత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. రోహిత్ ను టీ20ల నుంచి తప్పించాలంటూ పెద్దయెత్తున డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఫామ్ లో లేడని, అతగాడిని తప్పించి వేరే వారికి పగ్గాలు అప్పగించడం బెటర్ అంటూ నెట్టింట క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. బీసీసీఐ ఎందుకింత నానుస్తుందంటూ దాని మీద కూడా మండి పడుతున్నారు. రోహిత్ శర్మ వరస ఫ్లాప్ షో తో క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకింత వివక్ష చూపడం అంటూ ఫైర్ అవుతున్నారు.
రెండు మ్యాచ్ లలో...
ఆప్ఘనిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. కొన్ని నెలల తర్వాత టీ 20 సారధ్య బాధ్యతలను స్వీకరించిన రోహిత్ శర్మ బాధ్యత లేకుండా ఆట ఆడుతున్నాడంటూ మండిపడుతున్నారు. మొహాలీ, ఇండోర్ లో జరిగిన రెండు మ్యాచ్ లలోనూ రోహిత్ అట్టర్ ఫ్లాప్ షో మరింత కోపాన్ని పెంచింది. దీంతో టీ 20ల నుంచి తప్పించాలంటూ పెద్దయెత్తున నెట్ లోనూ, ఎక్స్ లోనూ పోస్టింగ్ లు కనపడుతున్నాయి. రోహిత్ శర్మ గత రికార్డులను మరచి ఇలా ట్రోల్ చేయడం సరికాదంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం రోహిత్ ఇక గౌరవంగా టీ 20ల నుంచి తప్పుకోవడమే బెటర్ అని చెబుతున్నారు.
విఫలమయితే..?
రోహిత్ శర్మ కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయికి క్రికెట్ ప్రపంచంలో ఎదిగాడు. ఎన్నో రికార్డులు సృష్టించాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుని విజయాలను అందించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో ఫాంలో లేని అనేక మంది ఆటగాళ్లతో పాటు రోహిత్ శర్మ కూడా ఒకరుగా భావించి మరో ఛాన్స్ ఇవ్వాలే తప్పించి రెండు మ్యాచ్ లలో విఫలం కాగానే వెంటనే తప్పించమంటూ గోల పెట్టడం ఎంత వరకూ సబబని ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తనను ట్రోల్ చేసే వారికి ఆప్ఘనిస్తాన్తో జరిగే మూడో మ్యాచ్ లోనైనా రోహిత్ సరైన జవాబు ఇవ్వాలని కోరుకుందాం. ఈమ్యాచ్ లో కూడా విఫలమయితే రోహిత్ ను మాత్రం ఎవరూ రక్షించలేరు. ఇది ఖాయం.
Next Story