రోహిత్ శర్మ పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడా?
ఆలూరులో భారత ఆసియా కప్ శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 4వ రోజు ఒక ఆశ్చర్యకర
ఆలూరులో భారత ఆసియా కప్ శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 4వ రోజు ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి బ్యాటింగ్ చేశాడు. రోహిత్ ఓపెనర్ గా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, KL రాహుల్ ఇంకా ఫిట్‌గా లేకపోవడంతో రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు క్రికెట్ నిపుణులు. సెప్టెంబర్ 2న క్యాండీలో జరిగే ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో.. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడని.. రోహిత్‌ను నంబర్ 3, విరాట్ కోహ్లీని నంబర్ 4 స్థానంలో పంపే అవకాశం కూడా ఉందని రాహుల్ ద్రవిడ్ & కో ఆలోచిస్తున్నారు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో భారత్ గత కొన్నేళ్లుగా సమస్య ఎదుర్కొంటోంది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నా.. గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ప్రపంచకప్ 2023 ముందు అయ్యర్‌కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా మేనేజ్మెంట్లో ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి కేఎల్ రాహుల్ అందుబాటులో లేకుంటే ఇషన్ కిషాన్‌కు జట్టులో చోటు దక్కుతుంది. అతడిని ఓపెనింగ్ పంపించి.. రోహిత్ శర్మ నాలుగో స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.