Mon Dec 23 2024 08:14:35 GMT+0000 (Coordinated Universal Time)
న్యూజిలాండ్ పై నెగ్గలేకపోయిన ఆఫ్ఘన్
చెన్నై వేదికగా సాగిన ఆఫ్ఘనిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఎటువంటి అద్భుతం జరగలేదు
చెన్నై వేదికగా సాగిన ఆఫ్ఘనిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఎటువంటి అద్భుతం జరగలేదు. ఏకంగా 149 పరుగులతో కివీస్ విజయాన్ని అందుకుంది. 289 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆఫ్ఘాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెహ్మనుల్లా గుర్భాజ్ 11, ఇబ్రహీం జాద్రన్ 14, హస్మతుల్లా షాహిదీ 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆఫ్ఘన్ జట్టు. రెహ్మత్ షా, అజ్మతుల్లా ఓమర్జాయ్ కలిసి నాలుగో వికెట్కి 54 పరుగులు జోడించారు. రెహ్మత్ షా 36, అజ్మతుల్లా ఓమర్జాయ్ 27, మహ్మద్ నబీ 7 , రషీద్ ఖాన్ 8, ముజీబ్ 4 చేసి అవుట్ అయ్యారు. నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ డకౌట్ కావడంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ కు తొందరగానే తెరపడింది. శాంట్నర్, లోకీ ఫెర్గుసన్ మూడేసి వికెట్లు తీశారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. 80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ పర్వాలేదనిపించగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ కు 15వేల మందికి పైగా హాజరయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. పాయింట్స్ టేబుల్ లో న్యూజిలాండ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆడిన 4 మ్యాచ్ లలో నెగ్గింది కివీస్. రెండో స్థానంలో టీమిండియా నిలిచింది.
Next Story