Sat Dec 28 2024 22:59:25 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup: న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్.. ఏ సమయానికి, ఎందులో..?
మెల్బోర్న్ లోని MCGలో T20 వరల్డ్ కప్ 2022లో భాగంగా మరో ఆసక్తికర సమరం మొదలుకాబోతోంది. కేన్ విలియమ్సన్కి చెందిన న్యూజిలాండ్, మహ్మద్ నబీ సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో టోర్నమెంట్ ను ప్రారంభించగా, ఆఫ్ఘనిస్తాన్ తమ మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. కివీస్ పాయింట్ల పట్టికలో గ్రూప్ 1లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైనా పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగు పరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఎమ్‌సిజి ట్రాక్ స్పిన్నర్లకు సహాయం చేస్తుందని భావించడం లేదని మహ్మద్ నబీ చెప్పాడు. బిగ్ బాష్‌లో ఆడుతున్నప్పుడు పిచ్ పొడిగా ఉండేది. బంతి ప్రారంభంలో ఒకటి లేదా రెండు ఓవర్ల పాటు స్వింగ్ అవుతుంది, కానీ ఆ తర్వాత అది కొంచెం నెమ్మదిగా ఉంటుంది, స్పిన్నర్లకు తక్కువ సహాయం ఉంటుంది.. బంతి అంతగా స్వింగ్ అవ్వదు. కానీ ఇప్పుడు ఇక్కడ పిచ్ కొత్తగా ఉంది. కొంచెం పచ్చగా ఉంటుంది, అలాగే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. నాలుగు లేదా ఐదు ఓవర్లు బంతి స్వింగ్ అవుతుందని నబీ చెప్పాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నరకు లైవ్ టెలీకాస్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఇండియా నెట్వర్క్ లో మ్యాచ్ ను లైవ్ టెలీకాస్ట్ చూడొచ్చు. ఆన్ లైన్ లో చూడాలనుకున్న వారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెబ్ సైట్, యాప్ లో చూడొచ్చు.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, డారిల్ మిచెల్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, మైఖేల్ బ్రేస్‌వెల్
ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘని, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజ్లాక్ ఫరూక్, ఖైస్ అహ్మద్, నవీన్ ఉల్ హక్ , దర్విష్ రసూల్, ముహమ్మద్ సలీం సఫీ
Next Story