Mon Dec 23 2024 16:20:01 GMT+0000 (Coordinated Universal Time)
కివీస్ స్పిన్నర్ సంచలనం.. పది వికెట్లు తీసి
భారత్ ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు
భారత్ ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ముంబయి స్టేడియం ఇందుకు వేదికగా మారింది. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో పది వికెట్లకు పది వికెట్లు తీసి కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అరుదైన రికార్డను సొంతం చేసుకున్నాడు. ముంబయి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 325 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అన్ని వికెట్లను అజాజ్ పటేల్ తీసుకున్నాడు.
గతంలో ఇద్దరు...
మొత్తం 47.5 ఓవర్లలో 119 పరుగులు ఇచ్చిన అజాజ్ పటేల్ పది వికెట్లను తీసుకున్నాడు. 1956లో జరిగిన టెస్ట్ లో ఆస్ట్రేలియాపై పది వికెట్లన ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ సాధించాడు. 1999లో భారత్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సయితం పాకిస్థాన్ పై పది వికెట్లు సాధించాడు. పది వికెట్లు సాధించిన మూడో ఆటగాడిగా అజాజ్ పటేల్ రికార్డులకెక్కాడు.
Next Story