Fri Nov 22 2024 23:03:36 GMT+0000 (Coordinated Universal Time)
"బంగారు" తల్లి నిఖిత్ జరీన్
కామన్ వెల్త్ గేమ్స్ లో తెలంగాణకు చెందిన నిఖిత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. వరస బౌట్లతో నిఖత్ జరీన్ విజయం సాధించింది.
కామన్ వెల్త్ గేమ్స్ లో తెలంగాణకు చెందిన నిఖిత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. వరస బౌట్లతో నిఖత్ జరీన్ విజయం సాధించింది. బాక్సింగ్ 48 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని గెలుచుకుంది. నార్త్ ఐర్లాండ్ బాక్సర్ క్లారీపై 5 - 0 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. నాకౌట్ విక్టరీని జరీన్ సాధించడం పట్ల దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చూపిన అద్భుతమైన ప్రతిభను పలువురు ప్రశంసిస్తున్నారు.
ఈ ఏడాదిలోనే....
ఈ ఏడాది మే 19న ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లోనూ నిఖత్ జరీన్ స్వర్ణ పతకాన్ని సాధించింది. 52 కిలోల విభాగంలో థాయ్ లాండ్ క్రీడాకారిణి జిట్ పాంగ్ పై ఫైనల్ లో గెలిచి తెలంగాణకే దేశానికి పేరుతెచ్చింది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలిచి తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది.
Next Story