Mon Dec 23 2024 12:16:49 GMT+0000 (Coordinated Universal Time)
వరల్డ్ కప్ కోసం భారత్ వచ్చే పాకిస్థాన్ జట్టు ఇదే
ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ శుక్రవారం తమ జట్టును ప్రకటించింది
భుజం గాయంతో నసీమ్ షా టోర్నీ నుంచి వైదొలగడంతో 2023 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. జూన్ 2022లో చివరిసారిగా ODI ఆడిన రైట్ ఆర్మ్ పేసర్ హసన్ అలీ, నసీమ్ స్థానంలో పాకిస్థాన్ జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్లో గాయపడిన హరీస్ రవూఫ్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఫఖర్ జమాన్ కూడా జట్టులో ఉన్నాడు. బాబర్ ఆజం జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
పాక్ టాపార్డర్ లో బాబర్ అజామ్ తో పాటు ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ ఆఘాలు ఉన్నారు. మిడిలార్డర్ లో మహ్మద్ హరీస్, సాద్ షకీల్ ఉండనున్నారు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదికి హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిమ్, హసన్ అలీ సహకారం అందించనున్నారు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, సల్మాన్ ఆఘా, ఇఫ్తికార్ అహ్మద్ వంటి స్పిన్ ఆల్ రౌండర్లకు పాక్ జట్టులో చోటు కల్పించారు.
భారత్తో జరిగిన ఆసియా కప్ ఎన్కౌంటర్లో నసీమ్ షా భుజానికి గాయం అయింది. జట్టులోకి తిరిగి వచ్చిన హసన్ అలీ ఇప్పటివరకు 60 వన్డేలకు పాకిస్థాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2019 ప్రపంచ కప్ ఎడిషన్లో కూడా హసన్ అలీ పాకిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు.
ప్రపంచ కప్ 2023 కోసం పాక్ జట్టు:
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం (సి), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ది మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ
Next Story