Mon Dec 23 2024 15:29:09 GMT+0000 (Coordinated Universal Time)
ఈ మ్యాచ్ కు గిల్ దూరం... ఆ స్థానంలో
భారత్ - ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత్ బౌలర్లపై పడింది. తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియాను పరిమితం చేయగలిగితే గెలవడం సులభమవుతుంది.
టాస్ గెలిచి...
ఈ మ్యాచ్కు భారత్ ఓపెనర్ శుభమన్ గిల్ అందుబాటులో ఉండటం లేదు. డెంగ్యూ కారణంగా ఆయన ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ ఆడనున్నారు. ఇప్పటి వరకూ భారత్ - ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ పన్నెండు సార్లు ఆడగా, ఎనిమిది సార్లు ఆస్ట్రేలియా, నాలుగు సార్లు భారత్ విజయం సాధించాయని గణాంకాలు చెబుతున్ననాయి. ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతుంది.
Next Story