Mon Dec 23 2024 18:53:20 GMT+0000 (Coordinated Universal Time)
కోహ్లీ వర్సెస్ గంభీర్
టీం ఇండియా ఆటగాడు విరాట్ కొహ్లి, లక్నోె సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ల మధ్య మరోసారి వివాదం జరిగింది.
టీం ఇండియా ఆటగాడు విరాట్ కొహ్లి, లక్నోె సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ల మధ్య మరోసారి వివాదం జరిగింది. గ్రౌండ్లో వీరిద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడితే చాలు ఘర్షణకు దిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకరిపై ఒకరు సైగలతో రెచ్చగొట్టే విధంగా చర్యలకు దిగడంతోనే తరచూ వివాదాలు జరుగుతున్నాయి. నిన్న లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది.
హేక్ హ్యాండ్ తీసుకునే సమయంలో...
దీంతో షేక్ హ్యాండ్ తీసుకునే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరికి అంపైర్లు జరిమానాను విధించారని చెబుతున్నారు. అంపైర్ల జోక్యంతోనే వివాదం సద్దుమణిగిందని చెబుతున్నారు. ఒక దశలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితికి వచ్చింది. మొన్న చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ నోటి మీద వేలు పెట్టుకుని సైలెంట్ అంటూ సైగలతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు.
Next Story