పాకిస్థాన్ ప్రపంచ కప్ ఆశలు గల్లంతైనట్లేనా?
ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసింది. ఎన్నో మ్యాచ్ లలో పాకిస్థాన్ జట్టును
ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసింది. అంతకు ముందు ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఎన్నో మ్యాచ్ లలో పాకిస్థాన్ జట్టును ఓడించే అవకాశం దక్కినా కూడా చివరికి పాకిస్థాన్ నే విజయం వరించేది. ఇప్పటిదాకా 7 వన్డే మ్యాచ్ లలో పాకిస్థాన్ గెలిచింది.. ఒక్క మ్యాచ్ కూడా ఆఫ్ఘన్ గెలవలేదు. అలాంటిది ప్రపంచ కప్ వేదికగా ఇన్నాళ్ల పగను ఆఫ్ఘన్ తీర్చుకుంది. 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఆఫ్ఘన్. భారత్ తో ఓటమి తర్వాత పాకిస్థాన్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియాతోనూ ఓడిపోయింది. ఇప్పుడు ఆఫ్ఘన్ చేతిలోనూ చావు దెబ్బ తిన్నది. ఈ వరుస ఓటములు పాకిస్థాన్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేశాయి. మిగిలిన అన్ని మ్యాచ్ లలో పాకిస్థాన్ నెగ్గితే కానీ సెమీస్ కు చేరడం కష్టమే!! ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే ఇంగ్లండ్ ను ఓడించిన ఆఫ్ఘన్.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పాక్ పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన పాక్ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.