Mon Dec 23 2024 09:55:01 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ బ్యాట్ మీద పాలస్తీనా జెండా.. ఏమి జరిగిందంటే?
ICC ప్రవర్తనా నియమావళి ప్రకారం.. రాజకీయ, మతపరమైన లేదా జాతిపరమైన
దేశవాళీ మ్యాచ్‌లో తన బ్యాట్‌పై పాలస్తీనా జెండాను ప్రదర్శించినందుకు పాకిస్థాన్ బ్యాటర్ అజం ఖాన్‌పై జరిమానా విధించాలనే నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తీసుకుంది. లాహోర్ బ్లూస్‌తో కరాచీ వైట్స్ తలపడినసమయంలో అజం ఖాన్ బ్యాట్ మీద పాలస్తీనా జెండా ఉంది. ఈ పని చేసినందుకు కరాచీ వైట్స్ ఆటగాడైన అజం ఖాన్ మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు. అయితే, పీసీబీ దీనిని సమీక్షించి, మ్యాచ్ అధికారులు విధించిన పెనాల్టీని రద్దు చేయాలని నిర్ణయించింది.
కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో లాహోర్ బ్లూస్‌తో జరిగిన నేషనల్ T20 కప్ 2023-24 మ్యాచ్‌లో కరాచీ వైట్స్ వికెట్‌కీపర్-బ్యాటర్ లెవల్-I నేరానికి పాల్పడినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించామని మొదట ప్రకటన వచ్చింది. PCB ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4ను అజామ్ ఉల్లంఘించినట్లు కనుగొన్నారు. ఇలాంటివి చేయాలనే ముందస్తు ఆమోదం పొంది ఉండాలి.
ICC ప్రవర్తనా నియమావళి ప్రకారం.. రాజకీయ, మతపరమైన లేదా జాతిపరమైన అంశాలకు సంబంధించిన సందేశాలను ప్రదర్శించడానికి ఆటగాళ్లను అనుమతించరు. వీటన్నిటినీ అజం ఖాన్ ఉల్లంఘించాడు. గత రెండు మ్యాచ్‌లలో అజం ఖాన్ ఇదే స్టిక్కర్‌ను ఉపయోగించాడు. అయితే ఆదివారం మ్యాచ్‌కు ముందు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ మ్యాచ్ ను టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అజం ఖాన్ 2021 నుండి పాకిస్థాన్ జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ T20 ఫార్మాట్లో భారీ హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. భారతదేశంలో జరిగిన ODI ప్రపంచ కప్ సందర్భంగా, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ ముహమ్మద్ రిజ్వాన్ కూడా గాజాలోని పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ట్వీట్ చేశాడు. అయితే ఇది అతని వ్యక్తిగత అభిప్రాయమని భావించిన ఐసీసీ జరిమానా విధించలేదు.
Next Story