Mon Dec 23 2024 02:26:11 GMT+0000 (Coordinated Universal Time)
భట్ ను గెంటేశారు.. 24 గంటల్లోనే!!
పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కన్సల్టెంట్‌గా ఉన్న సల్మాన్ భట్ తొలగించారు
పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కన్సల్టెంట్‌గా ఉన్న సల్మాన్ భట్ తొలగించారు. ఈ విషయాన్నీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ ధృవీకరించారు. కన్సల్టింగ్ ప్యానెల్లో కమ్రాన్ అక్మల్, రావ్ ఇఫ్తికర్ అంజుమ్లతో పాటు భట్ పేరు శుక్రవారమే ప్రతిపాదించారు. కానీ ప్యానెల్లో భట్ ఉండడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సల్మాన్ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే నా నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాను. నేను ఇప్పటికే సల్మాన్ బట్‌తో మాట్లాడాను. .నా టీమ్ నుంచి అతడిని తొలిగించానని చెప్పేశానని అన్నారు వాహబ్ రియాజ్.
పాక్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన సల్మాన్ భట్‌ను 24 గంటల తిరగక ముందే ఛీఫ్ సెలక్టర్ వాహబ్ రియాజ్ తొలిగించాడు. వహాబ్ రియాజ్ సెలక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్‌గా సల్మాన్ భట్‌ను నియమించడం ఆ దేశమాజీ క్రికెటర్ల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని విమర్శలు కురిపించారు.
Next Story