Mon Dec 23 2024 07:41:59 GMT+0000 (Coordinated Universal Time)
నో డౌట్స్.. భారత్ కు వచ్చేస్తున్న పాక్ జట్టు
భారత్ లో జరగనున్న ప్రపంచ కప్ టోర్నమెంట్లో పాకిస్థాన్ ఆడుతుందా లేదా అనే అనుమానాలు
భారత్ లో జరగనున్న ప్రపంచ కప్ టోర్నమెంట్లో పాకిస్థాన్ ఆడుతుందా లేదా అనే అనుమానాలు ఉండేవి. అయితే ఇందుకు సంబంధించి అనుమానాలు అవసరం లేదు. భారత్ లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో ఈ ఏడాది చివర్లో ఐసీసీ ప్రపంచ కప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్కు రానుంది.
“క్రీడలను రాజకీయాలతో కలపకూడదని పాకిస్థాన్ గట్టిగా నమ్ముతోంది. రాబోయే ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు తమ క్రికెట్ జట్టును భారత్కు పంపాలని నిర్ణయించింది. అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన బాధ్యతలను నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల స్థితికి అడ్డుకట్ట పడకూడదని పాకిస్థాన్ విశ్వసిస్తోంది." అంటూ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్కు రానుంది. గతంలో 2016 టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్లో పర్యటించింది.
ప్రపంచకప్కు జట్టును పంపడంపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భుట్టోతో సహా చాలా మంది మంత్రులు జట్టును భారతదేశానికి పంపడానికి ఒప్పుకున్నారు. అక్టోబరు 14న వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
Next Story