Sat Dec 21 2024 14:56:53 GMT+0000 (Coordinated Universal Time)
ఫైనల్ కు పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఇంటికే
వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ న్యూజిలాండ్ పై గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పాక్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది.
ఏడు వికెట్ల తేడాతో...
వరసగా వికెట్లు పతనం అవుతుండటంతో స్కోరు పెద్దగా చేయలేకపోయింది. మిచెల్ అర్థ సెంచరీ చేసి గౌరవ ప్రదమైన స్కోరు చేశారు. నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాక్ ఓపెనర్లే బ్యాట్ తో రఫ్ఫాడించారు. మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన పాకిస్థాన్ సెమీస్ లోకి దూసుకెళ్లింది.
Next Story