Mon Dec 15 2025 04:16:51 GMT+0000 (Coordinated Universal Time)
Pakisthan vs Bangladesh : పాకిస్థాన్ జట్టుకు అవమాన కరమైన ఫలితమే
బంగ్లాదేశ్ జట్టు చేతిలో పాకిస్థాన్ జట్టు టెస్ట్ క్రికెట్ సిరీస్ ను కోల్పోయింది

దాయాది దేశం పాకిస్థాన్ క్రికెట్ లోనూ చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు పాక్ జట్టంటే అన్ని జట్లు భయపడే వారు. ఫాస్ట్ బౌలర్లు, గెలిపించే సత్తా కలిగిన బ్యాటర్లున్న పాక్ జట్టు ఇప్పుడు పేలవంగా తయారయింది. తాజాగా బంగ్లాదేశ్ జట్టు చేతిలో పాకిస్థాన్ జట్టు టెస్ట్ క్రికెట్ సిరీస్ ను కోల్పోయింది. ఇంత దారుణమైన ఓటమితో పాక్ జట్టు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉంది. చిన్న జట్టు చేతిలో పరాజయం పొంది తనకు తానే ఇప్పటివరకూ ఉన్న ప్రతిష్టను దిగజార్చుకుంది.
పేలవ ప్రదర్శన...
రెండు టెస్ట్లలో ఘోర పరాజాయాన్ని చవిచూసింది. దీంతో ఐసీీసీ ర్యాకింగ్ లో ఎనిమిదో స్థానానికి పాక్ జట్టు పడిపోయింది. బంగ్లాదేశ్ సిరీస్ కు ముందు ర్యాంకింగ్ లో ఆరో స్థానంలో ఉన్న జట్టు రెండు స్థానాలకు కిందకు దిగజారింది. రెండు టెస్ట్లలో బంగ్లాదేశ్ లో ఘోర పరాజయమైన పాకిస్థాన్ జట్టుకు ఇది అవమానకరమైన పేలవ ప్రదర్శన అని చెప్పాలి. బంగ్లాదేశ్ జట్టు గెలిచి తొలిసారి టెస్ట్ సిరీస్ లో పాక్ ను ఓడించి రికార్డును క్రియేట్ చేయగలిగింది.
Next Story

