Mon Dec 23 2024 08:19:37 GMT+0000 (Coordinated Universal Time)
టీ20 ప్రపంచ కప్ ఫైనల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సెమీ ఫైనల్స్ లో రెండు జట్లు కూడా ఛేజింగ్ చేసే ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే..! ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు.
ఇరు జట్ల వివరాలు:
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్
టీవీలో ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించడానికి, క్రికెట్ అభిమానులు ప్రత్యక్ష ప్రసారం కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ను ఉపయోగించాలి. ఆన్ లైన్ లో, మొబైల్ వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. నవంబర్ 9 బుధవారం జరిగిన సెమీ ఫైనల్ 1 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాక్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో సెమీ ఫైనల్ లో భారత్ ను ఇంగ్లండ్ చిత్తు చేసి టైటిల్ వేటలో నిలిచింది.
Next Story