Mon Dec 23 2024 04:58:00 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ ఓడిపోగానే.. పాక్ పని అయిపోయింది
అదేంటీ మ్యాచ్ అయిపోకుండానే పాక్ పని అయిపోయిందని ఎలా
పాకిస్థాన్ సెమీస్ నుండి అవుట్.. అదేంటీ మ్యాచ్ అయిపోకుండానే పాక్ పని అయిపోయిందని ఎలా చెప్పబోతున్నారని అనుకుంటారా.. ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇక పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాలని అనుకోగా.. పాకిస్థాన్ టాస్ గెలవలేకపోవడంతో షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. పాక్ జట్టులోకి హసన్ అలీ స్థానంలో షాదాబ్ ఖాన్ వచ్చాడు.
ఇంగ్లండ్ : డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, జోస్ బట్లర్(కెప్టెన్), బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, అట్కిన్సన్, ఆదిల్ రషీద్.
పాకిస్థాన్ : రిజ్వాన్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజాం(కెప్టెన్), సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అగా సల్మాన్, షాహీన్ ఆఫ్రిది, హ్యారిస్ రవుఫ్, వాసీం జూనియర్.
పాక్ సెమీస్ చేరాలంటే మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగులు, ఛేదనలో అయితే 284 బంతుల తేడాతో పాకిస్తాన్ గెలవాల్సి ఉండేది. ఇప్పుడు ఛేదనలో 284 బంతులు మిగిలించి గెలవడం కష్టమే!!
Next Story