Mon Dec 23 2024 01:07:36 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో గ్రూప్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్, బుమ్రా భారత జట్టులోకి వచ్చాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్(w), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది. ఈ మ్యాచ్కు వేదికైన క్యాండీలోని పల్లెకెలె మైదానంలోళ వర్షం పడే అవకాశముంది. ప్రస్తుతం క్యాండీ వాతావరణం కూడా వర్షం పడే సూచనలతో భయపెడుతోంది. టాస్ సమయంలో ఎటువంటి వర్షం కనిపించలేదు. ఎండ బాగా ఉంది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం ఇబ్బంది పెట్టినా ఓవర్లు తగ్గించే అవకాశం ఉంది. మ్యాచ్ రద్దయితే భారత్, పాక్ జట్లకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో ఇప్పటికే నేపాల్పై గెలిచిన పాక్ జట్టు 3 పాయింట్లతో నేరుగా సూపర్ 4 రౌండ్కి చేరుకుంటుంది.
Next Story