Sat Dec 21 2024 05:18:38 GMT+0000 (Coordinated Universal Time)
నేపాల్ పై భారీ విజయాన్ని సాధించిన పాకిస్థాన్
ఆసియా కప్ 2023 లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు నేపాల్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో
ఆసియా కప్ 2023 లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు నేపాల్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత పాక్ 342 పరుగుల భారీ స్కోర్ చేయగా లక్ష్యచేధనలో పసి కూన నేపాల్ జట్టు 104 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం(151 : 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మద్(109 నాటౌట్ : 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. నేపాల్ బౌలర్లలో సోంపల్ కమీ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్యఛేదనకు దిగిన నేపాల్ బ్యాటర్లు 23.4 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యారు. 104 పరుగుల వద్ద నేపాల్ ఇన్నింగ్స్ ముగిసింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామీ (28), గుల్సన్ షా (13) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీసుకోగా.. షాహీన్ ఆఫ్రిది 2, హారిస్ రౌఫ్ 2, నసీం షా 1, మహ్మద్ నవాజ్ ఒక వికెట్ తీసుకున్నారు.
Next Story